హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు సంస్థాగతంగా పటిష్టరించేందుకు కసరత్తు ప్రారంభించింది. టిపిసిసి (TPCC) కొత్తగా నియామకం చేసిన ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు పనివిభజన చేసి రానున్న ఎన్నికలలో మెరుగైన ఫలితాలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నది.

పార్టీ అనుబంధ సంస్థలకు పనివిభజన
పార్లమెంట్ నియోజకవర్గాలకు కొంత మందిని, పార్టీ అనుబంధ సంస్థలకు కొంతమందిని కేటాయించి పనివిభజన చేశారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందులోభాగంగా పార్లమెంట్ ఇంచార్జీలుగా 17 మంది ఉపాధ్యక్షులను 51 మంది జనరల్ సెక్రటరీలను నియామకం చేశారు. ఒక్కొ పార్లమెంట్కు ఒక ఉపాధ్యక్షుడితోపాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఇంచార్జీలుగా ఉండి పార్టీని బూతుస్థాయి పార్లమెంట్ ఇన్చార్జీలుగా 17 మంది ఉపాధ్యక్షులు, 51 మంది కార్యదర్శులు పార్టీ అనుబంధ సంస్థల ఇన్ చార్జీలుగా 22 మంది విపిలు, 10 మంది కార్యదర్శులు కార్యకర్తతో సమన్వయం చేసుకుంటు ముందుకుపోవాలనే ఉద్దేశ్యంతో ఈ విధమైన కూర్పును టిపిసిసి అధ్యక్షుడు చేసినట్లు జాబితాను చూస్తే అర్థం అవుతోంది.
జిల్లాల వారీగా జనరల్ సెక్రటరీలు
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంకు ఎంపీ రఘువీర్ రెడ్డి ఆయనతోపాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఉంటారు. పెద్దపల్లి- గాలి అనిల్ కుమార్ ఆయనతోపాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తారు. కరీంనగర్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ నాయకత్వంలో ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఉంటారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ -బాల్మూర్ వెంకట్ తోపాటు ముగ్గురు కార్యదర్శులు, జహీరాబాద్- బండి రమేష్, మెదక్ నవాబ్ ముజాహిదీన్ ఆలం ఖాన్, మల్కాజ్ గిరి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సికింద్రాబాద్- ఝాన్సీ రెడ్డి, హైదరాబాద్ -సంగమేశ్వర్, చేవెళ్ల బొంతు రామ్మోహన్, నాగర్ కర్నూల్ కొండేటి మల్లయ్య, నల్గొండ- మామిండ్ల శ్రీనివాన్, భువనగిరి కోటింరెడ్డి -వినయ్ రెడ్డి వరంగల్- సత్య నారాయణ, మహబూబాబాద్- నాగేశ్వర్ రావు, ఖమ్మం శ్రవణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ -వేణు గౌడ్లు వారితోపాటు ముగ్గురేసి కార్యదర్శలు ఉంటారు. ఇక పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జీలుగా 22 విపిలను, 10 నియమించారు.
Read also: HYDRA: మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా