हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Telangana tourism:దేవాదాయ భూముల్లో పర్యాటకులకు వసతులు!

Pooja
Telangana tourism:దేవాదాయ భూముల్లో పర్యాటకులకు వసతులు!

Telangana tourism : తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధిపై టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. పర్యాటకులకు అనువైన ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రహదారులకు, ముఖ్య పట్టణాల్లో, ఆలయాలకు సమీపంలో ఉన్న దేవాదాయ శాఖ భూములను పర్యాటకులకు అనువైనవిధంగా అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ భూములు ఇస్తే కాటేజీలు, రిసార్ట్ ల నిర్మాణం చేపడతామని దేవాదాయశాఖకు టూరిజంశాఖ ప్రతిపాదిస్తోంది.

Read Also: Tirupati: భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ – దర్శనాలు, సేవల్లో మార్పులు

Telangana tourism
Telangana tourism: Accommodation for tourists in endowment lands!

దేవాదాయశాఖ సైతం తన పరిధిలోని భూములను అభివద్ధి చేసేందుకు పర్యాటకశాఖకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ రెండు శాఖల మధ్య ఎంఓయూ జరగనున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఆలయాలకు 87235.39 ఎకరాలను కేటాయించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ భూములపై కొరవడటంతో ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల భూములు క్రమణకు గురయ్యాయి. లిటిగేషన్లో మరో 5569 35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆ భూముల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోపక్క కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంపైనా దృష్టి సారించింది. కొన్ని ఆలయాలకు చెందిన తూములను లీజులకు ఇవ్వగా కొన్ని భూములు నిరూపయోగంగా ఉన్నట్లు సమాచారం ఆ మాములను పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది. ఈ భూములను తమకు అప్పగిస్తే అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామంటూ టూరిజంశాఖ ప్రతిపాదన చేసింది.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు అనేకం చోటుచేసు కుంటున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని టూరిజం శాఖ గుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. కొండకింద ఆలయ భూములు ఉండటంతో ఆ భూములు లీజుకు ఇస్తే కాటేజీలు, వెల్నెస్ సెంటర్లు, బడ్జెట్ హోటళ్లు నిర్మించేలా ప్లాన్ రూపొందించింది. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు వీకెండ్ స్పాట్గా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నది. ఇది విజయవంతం అయితే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు అయిన వేములవాడ, భద్రాచలం, బాసర, ఇతర ప్రముఖ ఆలయాల భూముల్లోనూ ఇదే తరహా అభివృద్ధిని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870