తెలంగాణ (Telangana) లో మద్యం అమ్మకాలు ఎప్పుడూ జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే బీరు విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అయితే, ఈ వేసవిలో బీర్ లవర్స్ నిరాశ ఎదురవ్వబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టడమే. సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతుల నేపథ్యంలో ఈ వేసవిలో రాష్ట్రంలో బీర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Davos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు WEF మద్దతు
కారణాలు
ఈ మరమ్మతుల వల్ల సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్ కంపెనీలకు సింగూరు నుంచి అందే నీటి సరఫరా ఆగిపోనుంది. నీటి వనరులు లేకపోవడంతో బీర్ల ఉత్పత్తి భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ 44 లక్షల లీటర్ల నీరు సింగూరు జలమండలి నుంచి బీరు ఫ్యాక్టరీలకు సరఫరా అవుతోంది.

మరమ్మతుల కారణంగా ఈ నీటి సరఫరా నిలిచిపోతే, బీర్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు సంగారెడ్డి పట్టణంలో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఈ పంపిణీ ఆగిపోయినట్లయితే జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు సరఫరా అయ్యే బీర్లపై కూడా ప్రభావం పడనుంది.మరోవైపు ప్రస్తుతం బీర్ల ఫ్యాక్టరీలకు నామమాత్రపు ధరకే ప్రభుత్వం నీటిని అందిస్తున్నది.
ఇప్పుడు అధిక చార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేస్తే తెలంగాణలో మద్యం ప్రియులపై మరింత భారం పడటం ఖాయం. అయితే వేసవి డిమాండ్ నేపథ్యంలో బీర్ల ఉత్పత్తిని పెంచాలని, కొరత లేకుండా చూడాలని ఇప్పటికే బ్రూవరీలకు ప్రభుత్వం సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: