ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం
తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ తోపాటు.. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను సమర్థవంతంగా అందించడంపై తెలంగాణ విద్యా కమిషన్ సోమవారం ఉన్నత స్థాయి సెమినారు నిర్వహించింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షత వహించగా, కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు స్వాగతం పలుకుతూ బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ అనే అంశాన్ని విశాల దృక్పథంతో, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ చొరవలు అనే అంశంపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్‌లో డాక్టర్ విజయ్ కుమార్ తడకమల్ల (బిట్స్ పిలానీ, హైదరాబాద్), డాక్టర్ ఎ గిరిధర్ రావు(అజిమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు), డాక్టర్ సంతోష్ మహాపాత్ర(బిట్స్ పిలానీ, హైదరాబాద్) ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు.

Telangana : తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం
సెమినార్లో బోధనా విధానంపై కాకుండా, ఆంగ్లాన్ని మాతృభాషను బోధనా మాధ్యమంగా ఎందుకు చేయాలనే అంశంపై దృష్టి సారించిందని ఆకునూరి మురళి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మ విశ్వాసము, ఉద్యోగ అవకాశాలు, అందుబాటులోకి ఉన్నత విద్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గిరిజన వర్గాలతో కలిసి పనిచేస్తున్న సంతోష్ ఎశ్రాం మాట్లాడుతూ పిల్లలు తరచుగా ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో ఎలా సమస్యలను ఎదుర్కొంటారో మాట్లాడారు. సందర్భోచిత, సంభాషణాత్మక ఆంగ్ల అభ్యాసాన్ని, సరళమైన, ఆటమార్గ బోధనా పద్ధతుల ద్వారా చెప్పాలన్నారు.
Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు