తెలంగాణ (Telangana ) రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ప్రముఖ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ (Transferring), వారికి కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ బదిలీలు ప్రస్తుత పోలీసు పరిపాలనలో కీలక మలుపు కావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్తగా బదిలీ అయిన సీనియర్ అధికారుల వివరాలు:
పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్ కొనసాగనున్నారు. హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీగా ఉన్న చైతన్యకుమార్ ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కాంతిలాల్ సుభాష్ ను కుమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా స్థానచలనం కల్పించింది. అలాగే మైనార్టీ వెల్ఫేర్ లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ను చార్మినార్ రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావుకు స్థానచలనం కలిగింది.
Read also: Local Body Elections : 2 నెలల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు?