cyber crime complaint : ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా Telangana Police కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే, ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ‘సీ-మిత్ర’ పేరుతో ప్రత్యేక వర్చువల్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు.
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీ-మిత్ర ద్వారా బాధితులను స్వయంగా సంప్రదించి, ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజుల్లో వెయ్యి మందికి ఫోన్ చేసి, 200 మందికి ఫిర్యాదులు తయారు చేయగా, నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ కాపీలు బాధితుల ఫోన్లకు పంపినట్లు తెలిపారు.
Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు
సైబర్ మోసానికి గురైన వారు ముందుగా 1930 హెల్ప్‌లైన్ లేదా (cyber crime complaint) జాతీయ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సీ-మిత్ర హెల్ప్ డెస్క్ ద్వారా ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలంగాణ పోలీస్ అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: