తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్తను అందించింది. ముఖ్యంగా జనవరి నెల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఉద్యోగులకు పెద్ద సౌకర్యాన్ని కలిగించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం రూ.720 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Sammakka Saralamma: ముగిసిన మేడారం జాతర
ఉద్యోగులు హర్షం
ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల హామీల అమలులో ప్రజా ప్రభుత్వం వేగం పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా విడుదల హామీ కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. వీటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. సరెండ్ లీవులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: