Telangana local body elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలను సింగిల్ ఫేజ్‌లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ విడుదలతోనే జీహెచ్‌ఎంసీ పరిధిని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. శివరాత్రి పండుగ, రంజాన్ ఉపవాసాల ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం రాష్ట్ర (Telangana local body elections) ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల: జనవరి 28
- నామినేషన్ల ప్రారంభం: జనవరి 28
- నామినేషన్ల చివరి తేదీ: జనవరి 30
- స్క్రూటినీ: జనవరి 31
- ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3
- పోలింగ్: ఫిబ్రవరి 11
- కౌంటింగ్: ఫిబ్రవరి 13
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: