हिन्दी | Epaper

Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు

Anusha
Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు

Telangana: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది.

Read Also: Mulugu Crime: ములుగు జిల్లాలో దారుణం: బాలికపై సర్పంచ్ భర్త అఘాయిత్యం

స్పీకర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం వెల్లడించారని, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తయిందని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందిన ధర్మాసనం, స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున ఈ కేసును మూసివేస్తున్నట్లు తెలిపింది.

పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారని.. వాటిపై తగిన నిర్ణయం తీసుకుని.. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయాన్ని లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కార్యాలయం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఏకీభవించింది.

Telangana: MLAs’ defection case.. Supreme Court favors Speaker’s decision

ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని.. తన తీర్పును వెలువరించినందున.. ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీలను.. ఫిర్యాదుదారులకు 2 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

📢 For Advertisement Booking: 98481 12870