Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకుల పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకుల చేరికల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. “కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తమ నీడను వారే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు” అని ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం
పనిచేయరు.. చేసేవారిని చేయనివ్వరు!
నీడను వారే నమ్మని వారు వాళ్లు పని చేయరు మరొకరిని పనిచేయరని విమర్శించారు. అలాంటి వారి వల్ల పార్టీ నష్టపోతుందని, ప్రజలు కూడా నష్టపోతారని మంత్రి వ్యాఖ్యానించారు.నమ్మకమైన కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ నాయకుడు ప్రశాంతంగా ఉండగలగుతారని అన్నారు. తన వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.

కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను వాళ్లు నమ్మలేని పరిస్థితి ఉందని అన్నారు. పని చేయని ఎమ్మెల్యేలు, ఇంకొకరికి అడ్డుపడే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లడం ఇష్టం ఉండదని అన్నారు. వాస్తవానికి అలాంటి వారి కారణంగా పార్టీ నష్టపోతోందని అన్నారు. కాగా, ఆమె పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: