తెలంగాణాలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, మద్యం ధరలను 10% నుంచి 15% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ నుంచి మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
ధరల పెంపు
ధరల పెంపు ఏపీలో రూ 99కే మద్యం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోనూ ఇదే తరహాలో మద్యం కోసం పరిశీలన జరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో సైతం రూ 99 కే లిక్కర్ అమ్మకాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా మద్యం అమ్మకాల పైన ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి, విక్రయాలు, ఎన్డీపీఎల్ కేసులు కూడా తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. తాజాగా మద్యం ధరల పెంపు పైన ప్రభుత్వా నికి ప్రతిపాదనలు అందాయి.
ప్రైస్ ఫిక్సేషన్ కమిటి
అన్ని రకాల బ్రాండ్ల ధరలు పెంచేలా అంచనాలు సిద్దం చేసారు. ఈ పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అధికారుల ప్రతిపాదనలు మద్యం ధరల పైన కసరత్తు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటి 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఇక, ఏపీలో అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ బ్రాండెడ్ మద్యం ధరలతో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్లు అధికారులు నివేదించారు.

మద్యం దుకాణాల్లో
దీంతో, సరిహద్దు మద్యం దుకాణాల్లో విక్రయాలు పడిపోయాయి.పెరుగుదల ఎంత దీని ద్వారా రాష్ట్ర మద్యం ఆదాయం దాదాపు రూ 1000 కోట్ల మేర తగ్గినట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణ కంటే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో రాయల్ చాలెంజ్ క్వార్టర్ రూ.210, ఫుల్ బాటిల్ రూ.840 ఉంటే, ఏపీలో క్వార్టర్ రూ.230, ఫుల్ బాటిల్ రూ.920గా ఉంది. క్వార్టర్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 అదనపు ధర ఉంది.
మద్యం ధరలు పెంచే యోచన
త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. క్వార్టర్‌పై రూ.20, బీరుపై రూ.10 ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏ బ్రాండ్ మద్యం ధర ఏ మేర పెంచాలనే అంశం పైన వివరాలు సమర్పించారు. ఈ ధరల విషయంలో ప్రభుత్వం ఏ మేర పెంచేందుకు అనుమతి ఇస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.