हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Telangana: జూన్ నాటికి 9 వేల ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం!

Tejaswini Y
Telangana: జూన్ నాటికి 9 వేల ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం!

Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కొన్నింటికి ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించగా… 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి మరికొన్నింటి లోనూ నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. జూన్ నాటికి రాష్ట్రంలోని 9వేట స్కూల్స్కి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ భారత్ నిధితోపాటు టి ఫైబర్ సహకారంతో రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్స్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ప్రభుత్వ స్కూల్స్కి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో భాగంగా గత రెండు నెలల్లో 2,649 పాఠశాలలకు నెట్ సౌకర్యం కల్పించారు.

Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!

Telangana: Internet facility for 9 thousand government schools by June!
Telangana: Internet facility for 9 thousand government schools by June!

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8956 గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి 8,956 స్కూల్స్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 2,649 పాఠశాలల్లో గత రెండు నెలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన 6,307 బరులకు జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 8,956 పాఠశాలల్లో 5,354 పాఠశాలలకు డిజిటల్ భారత్ నిధి కిండ బీఎస్ఎన్ఎల్ నెట్ను అందుబాటులోకి తీసుకురానుండగా.. మరో 674 పాఠశాలలకు టీ ఫైబర్ విభాగం ఉచితంగా ఈ సదుపాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది.

కేంద్రం నిర్ణయించిన నేపథ్యం

ఈ రెండూ కలిపి 6,028 పాఠశాలలకు ఉచితంగా నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుండగా.. మరో 2,928 పాఠశాలలకు బిల్లు చెల్లింపు ప్రాతిపదికన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఒప్పందాలు జరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కోసం బీఎస్ఎన్ఎల్కు నెలకు రూ.599 వెల్లించనుండగా.. టీ ఫైబర్ కు రూ.900 చొప్పున చెల్లించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో జాతీయ సగటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించగా అదికాస్త రాష్ట్రంలో 21.90 శాతంగా ఉంది.

2024-25 విద్యా సంవత్సరం నాటికి జాతీయ సగటు 58.60 శాతానికి పెరగగా.. రాష్ట్రంలోనూ 52.90 శాతం పాఠశాలటకు ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర సర్కార్ చర్యలు. తీసుకుంటోంది. అందులో భాగంగానే కొత్తగా 8,956 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు సుమారు 26వేల వరకు ఉండగా.. అందులో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ సుమారు 2వేల వరకు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

E paper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870