Telangana Housing Board flats : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సొంత ఇల్లు కొనాలనుకునే వారికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయ వర్గాల (LIG) కోసం గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం నగరాల్లో మొత్తం 339 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. ముఖ్యంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో కేవలం రూ. 26.4 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్ అందుబాటులో ఉండటం విశేషం.
హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్‌లోని రాంకీ ఎన్‌క్లేవ్‌లో 102, ఖమ్మంలోని శ్రీరామ్ హిల్స్‌లో 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న ఫ్లాట్లే కాగా, ఇప్పటికే నివాసాలు కొనసాగుతున్న ప్రాంతాల్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
Read Also: Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ
ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి గల వారు రూ. 1 లక్ష EMD చెల్లించి హౌసింగ్ బోర్డ్ (Telangana Housing Board flats) అధికారిక వెబ్‌సైట్ లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జనవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

ఫ్లాట్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా జరగనుంది. గచ్చిబౌలి ఫ్లాట్లకు జనవరి 6న, వరంగల్‌కు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్లకు జనవరి 10న లాటరీ నిర్వహించనున్నారు. ఫ్లాట్ కేటాయింపు పొందిన వారు కనీసం ఐదేళ్ల పాటు ఆ ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టడం లేదా అద్దెకు ఇవ్వడం వీలుకాదని అధికారులు స్పష్టం చేశారు. తక్కువ ధరలో కీలక ప్రాంతాల్లో నివాసం పొందాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం అని హౌసింగ్ బోర్డ్ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: