తెలంగాణలో వర్షాలు వరుసగా కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయం అవుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రుతుపవన ద్రోణి కొనసాగుతోంది
ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుండి ఈశాన్య బంగాళాఖాతం (Northeast Bay of Bengal)వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తరాంధ్ర సముద్ర ప్రాంతాల్లో, సముద్రమట్టానికి 4.5 కి.మీ ఎత్తులో చక్రవాత ఆవర్తనం కనిపిస్తోంది. ఇదే కాకుండా, ఉపరితలంలో ఉన్న చక్రవాత ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా బలపడనుంది.

ఇవాళ భారీ వర్షాల హెచ్చరిక ఉన్న జిల్లాలు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్ 12న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా నిర్మల్(Nirmal), నిజామాబాద్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో వర్షాలు మోస్తరు నుండి భారీ స్థాయిలో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రేపటికి కూడా వర్ష సూచన
సెప్టెంబర్ 13న కూడా వర్షాల ప్రభావం కొనసాగనుంది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షా లు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవే నిర్మల్,నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట,మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్
సిద్దిపేటలో తుఫాన్ లాంటి వర్షం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం తీరుగా కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి చిన్నపాటి కుంటలా మారిపోయాయి. వాహనదారులు రహదారిపై ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షానికి ముందు సుదీర్ఘంగా ఉన్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. అయితే భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు వర్షం కొంతవరకు ఉపశమనం ఇచ్చింది.
వర్షాలు ఎన్ని రోజులు కొనసాగవచ్చు?
వాతావరణ శాఖ ప్రకారం, వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. కొన్ని చోట్ల నాలుగు రోజులు వరకూ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు ఉన్నాయి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
- అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా ఉండాలి
- నీటిమయమైన ప్రాంతాల నుండి దూరంగా ఉండాలి
- స్థానిక అధికారుల సూచనలు పాటించాలి
- విద్యుత్ లైన్ల దగ్గర తిరగవద్దు
- సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి
Read hindi news: hindi.vaartha.com
Read also: