తెలంగాణ దేవాలయాల్లో ఈ-హుండీ ఏర్పాటు
హైదరాబాద్ : అంతా డిజిటల్ మయం అయిపోవడంతో చాలా మంది క్యాష్ ను
మెయింటేన్ చేయడం లేదు. దీంతో పుణ్యక్షేత్రాల (Telangana) దర్శనాలకు వెళ్లినప్పుడు హుండీలో వేయడానికి క్యాష్ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో ఇ-హుండీ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇతర సేవల కోసం కూడా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా.. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాల్లోనూ క్యూఆర్(QR Code) కోడ్తో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో అన్ని దేవాలయాల్లో అమలు చేయనున్నారు. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. చాలా మంది చేతిలో క్యాష్ ఉండటం లేదు. తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లినప్పుడు..
గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0

డిజిటల్ కానుకల యుగం ప్రారంభం
హుండీల్లో డబ్బులు వేయాలనుకున్నప్పుడు చేతిలో క్యాష్ లేక ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో భక్తులకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అన్ని రకాల సేవలకు డిజిటల్ చెల్లింపుల (ఈ పేమెంట్స్) విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పేమెంట్స్ విధానం ప్రకారం ఇకపై హుండీల్లో నేరుగా డబ్బులు వేయలేకున్నా.. ఫోన్పే, గూగుల్ పే వంటి వ్యాలెట్లతో కానుకలు చెల్లించొచ్చు. అందులో భాగంగా ఇ-హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయంలో జరిగే వివిధ సేవలకు ప్రత్యేక డిజిటల్ అకౌంట్లను కూడా కేటాయించనుంది దేవాదాయ శాఖ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: