
తెలంగాణ (Telangana) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్‌లో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. మక్తల్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఒక్కసారిగా జెండా కర్ర విరిగిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
Read Also: TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం
మంత్రి సమక్షంలోనే ఘటన
మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరిద్దరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మంత్రికి ప్రమాదం తప్పింది. జెండా నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఫై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: