ఖరీదైన వాహనాల పేరుతో మోసం
Telangana Cyber Crime: సోషల్ మీడియాలో లక్కీ డ్రా, గివ్ అవే పేరుతో ఖరీదైన కార్లు, బైకులు, స్థలాలు ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఏడుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించినట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది.
Read Also: KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

లక్కీ డ్రా లింక్‌లపై క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్
బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి కళ్లెం పడిన నేపథ్యంలో, కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. లక్కీ డ్రా (Lucky Draw Scam) లేదా గివ్ అవే పేరుతో పంపే లింక్‌లపై క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ విధమైన లింక్‌ల ద్వారా బాధితుల ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసి, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఫలితంగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి మోసాల బారిన పడిన వారు లేదా అనుమానాస్పద ప్రచారాలు కనిపిస్తే తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి మోసపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: