Telangana CM: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభిస్తారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో భాగంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53 లక్షల 80 వేల రూపాయల విలువైన 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్స్( గడ్డిని కట్టకట్టే యంత్రాలు) వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు.
Read Also: Ponnam Prabhakar: హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

మూడు రోజుల పాటు రైతు మేళా
ఈనెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెట్టలో నూతనగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఈ సందర్భంగా మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం పర్యటన కోసం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలిస్తామని తెలిపారు. వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో అధికంగా ఉపయోగపడే చిన్నచిన్న పరికరాలను గతంలో రైతులకు అందించలేదని ఇప్పుడు అందిస్తున్నామని అన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ కింద ఇంకా వ్యవసాయ పరికరాలను అందించేందుకు వీలుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులను యాత్రికరణలో భాగంగా వ్యవసాయ పరికరాలను తీసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీచేయనైనది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: