हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం

Saritha
Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం

హైదరాబాద్: ఈ యేడాది మిర్చి (ఎర్రబంగారం) రైతులకు కలిసివస్తోంది. (Telangana Chili Prices) గత ఏడాది మిర్చి ధరలు భారీగా పతనమవడంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరంగల్ (Warangal) ఎనమాముల, ఖమ్మం, కరీంనగర్ తదితర వ్యవసాయ మార్కెట్లకు మిర్చివంట పెద్ద ఎత్తున వస్తోంది. రాష్ట్రంలో తెలంగాణలో దేశీ రకం మిర్చి ఇప్పటికే వరంగల్ లోని ఏను మాముల వ్యవసాయ 41 వేల రూపాయల మైలు రాయిని దాటింది.

Read Also: Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం
This year brings good news for chili farmers.

(Telangana Chili Prices) మార్కెట్ యార్డులో మిర్చి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. పసిడి ధరలతో పోటీపడి పరుగులు పెడుతున్నాయి. దేశీ రకం టమాటా మిర్చి ఈ ఏడాది ఇప్పటివరకు రికార్డు ధర పలికింది క్వింటా దేశీరకం మిర్చి 41,200 రూపాయలు ధర పలుకుతుంది. దేశీ మిర్చి పండించిన రైతులు ఆనందంతో మురిసిపోతున్నారు. మరోవైపు ఎల్లో మిర్చి (పసుపు రకం మిరపకాయలు) క్వింటా 44 వేల రూపాయలు పలుకుతుంది. వండర్ హాట్ మిర్చి రకానికి కూడా డిమాండ్ పెరిగింది.

రెండు రోజుల క్రితం వరకు క్వింటా రూ.32,000 రూపాయలు పలికిన వండర్ హాట్ మిర్చి ధర ఒక్కరోజులోనే అయిదు వేలు పెరిగింది. ఈరోజు క్వింటా వండర్ హాట్ మిర్చి ధర రూ.37,100 కు పెరిగింది. ఈ రకం మిర్చికి ఉన్న ఘాటు, రంగు కారణంగా మసాలా కంపెనీల నుండి భారీ ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా అన్నిరకాల మిర్చి ధరలు పసిడితో పోటీపడి పైపైకి ఎగబాకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలకు ఫుల్ డిమాండ్ ఉండడంతోపాటు మధ్యప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో మిర్చి సాగు తగ్గడం వల్ల ఇక్కడ ఈ ఏడాది మిర్చికి భారీ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870