తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అధ్యక్షతన ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ క్యాబినెట్ భేటీలో జూన్ 2న జరగనున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై ముఖ్యంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
గచ్చిబౌలి భూముల వివాదాస్పద వ్యవహారం ఫై చర్చ
అవతరణ దినోత్సవంతో పాటు, కంచ గచ్చిబౌలి భూముల వివాదాస్పద వ్యవహారం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అంశాలలో ఒకటిగా తెలుస్తోంది. ఈ భూములపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై ప్రజల్లో వస్తున్న అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం సమీక్షించనుంది. భూముల కేటాయింపులపై పారదర్శక విధానం తీసుకురావాలనే దిశగా చర్చలు జరగనున్నాయి.
రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై చర్చ
అలాగే, నూతనంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై కూడా మంత్రివర్గం మంతనాలు జరపనుంది. ఈ పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. తదుపరి కార్యాచరణలో భాగంగా, ఈ పథకానికి నిధుల కేటాయింపులపై కూడా క్యాబినెట్ స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ సమావేశంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Mega DSC : మెగా DSC.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?