हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Telangana B.Tech: ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

Saritha
Telangana B.Tech: ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

Telangana B.Tech: తెలంగాణలోని 160 ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం (మార్చి 5) జీవో జారీ చేసింది. ఈ కొత్త ఫీజులు 2025-28 ఆర్థిక సంవత్సరాలకు బ్లాక్‌ పీరియడ్‌కు వర్తిస్తాయి. మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌ అంటే.. 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ ఫస్టియర్‌లో చేరినవారికి ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయి. ఆయా స్టూడెంట్స్ నాలుగేళ్లపాటు అవే రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: Kalvakuntla Kavitha: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

Telangana B.Tech: ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు
Telangana B.Tech New tuition fees for engineering colleges

ఫీజుల వివరాలు

రాష్ట్రంలో 33 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో రూ.లక్షకు పైగా.. రెండు కాలేజీలకు రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు. గత బ్లాక్‌ పీరియడ్‌లో ఫీజు రూ.లక్ష దాటిన కాలేజీ సంఖ్య 33 ఉండగా.. ఈసారి కూడా అంతే ఉన్నాయి. రూ.లక్ష ఉన్న కాలేజీల సంఖ్య అప్పట్లో 7 కాగా ప్రస్తుతం 2కి తగ్గాయి. అత్యధికంగా సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీకి ఫీజు రూ.1.83 లక్షలుగా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి కాలేజీ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) 19 కాలేజీలకు ట్యూషన్‌ ఫీజులను తగ్గించడంతోపాటు.. 70 కాలేజీలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా సర్కార్‌కు సిఫార్సు చేసింది. ఈ మేరకు ఆ సిఫార్సుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 21 కాలేజీలకు కనీస ఫీజు రూ.45 వేలు గా నిర్ణయించారు. ఈ కొత్త ట్యూషన్ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.

ఫీజు తగ్గింపు

ఈసారి 19 కాలేజీలకు ఫీజు తగ్గించారు. అంటే గత విద్యా సంవత్సరం వరకు ఉన్న ఫీజులో టీఏఎఫ్‌ఆర్‌సీ కోత పెట్టింది. గత ఆగస్టులో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా స్టూడెంట్స్ నుంచి పాత ఫీజులనే వసూలు చేశారు. తాజాగా ఫీజు తగ్గడంతో సొంతంగా ఫీజు చెల్లించినవారికి ఆయా కాలేజీలు ఆ వ్యత్యాసం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. రూ.లక్షన్నర వరకు ఫీజున్న కాలేజీలు ఇవే.. సీబీఐటీ, వాసవి, MGIT, CVR, నారాయణమ్మ, గోకరాజు, VNR

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870