శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల(Srisailam) మహా పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామిఅమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
Read Also: Medaram : మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డీఎఫ్వోలు విగ్నేష్ అపోవా, నీరజ్, భవిత కుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్, రేఖ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ మాట్లాడుతూ, సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, శ్రీశైలంలో(Srisailam) భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: