తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు(Sridhar Babu) సాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రూప్స్ పరీక్షల ద్వారా సుమారు 70 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: