పుష్ప – 2 సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులను సైతం తిరగరాసింది. కానీ ఓ కుటుంబానికి మాత్రం తీరని విషాదాన్ని మిగుల్చింది. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ తరుణంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ మీద అభిమానంతో సినిమా చూడడానికి వచ్చిన ఓ కుటుంబానికి అనుకోని చేదు ఘటన జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగుల్చింది. ఆ ఘటన కారణంగానే అల్లు అర్జున్ సైతం జైలుకు వెళ్లారు.అల్లు అర్జున్ మీద అభిమానంతో రేవతి అనే మహిళ, ఆమె భర్త, కుమారుడు శ్రీ తేజ్ తో కలిసి ‘పుష్ప 2’ ప్రీమియర్స్ చూడడానికి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అయితే అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే రేవతి మరణించగా, శ్రీతేజ్‌కు ఊపిరి ఆడకపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. వెంటనే బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
బ్రెయిన్ డ్యామేజ్
గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఈ దుర్ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి శ్రీతేజ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు సైతం శ్రీ తేజ్ ను చూడడానికి హాస్పిటల్ కు వెళ్లడం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కోమా లోనే ఉన్న శ్రీ తేజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది.ఇప్పటికీ చికిత్స కొనసాగుతుండగా రోజురోజుకీ శ్రీ తేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. శ్రీ తేజ్ ప్రస్తుతం కళ్లు తెరిచి చూస్తున్నాడని గత 15 రోజులుగా నోటి ద్వారా లిక్విడ్స్ కూడా అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. మనుషులను గుర్తుపట్టలేకపోయినా ప్రస్తుతం తన ఆరోగ్యం మాత్రం స్టేబుల్‌గానే ఉందని అంటున్నారు.
ప్రీమియర్స్
దీంతోనే డాక్టర్లతో పాటు శ్రీతేజ్ కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప్రతి నుంచి బాలుడిని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించినట్టు సమాచారం. ఫిజియోథెరపీ చేస్తే మరికాస్త త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయనే రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించామని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. బాలుడు త్వరగా కొలుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.మరి ఇప్పటికైనా ప్రజలు వారి కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగకుండా ప్రీమియర్స్, సినిమా రిలీజ్ ల సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని సినిమా ఈరోజు కాకపోతే రేపు అయినా చూడొచ్చు అని ఈ తరహా విషాదం జరిగితే సినిమా హీరోలు ఎవరు కనీసం పట్టించుకోరని అంటున్నారు.
Read Also : Wall Collapse: సింహాచలం దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు