Medak murder case : మానవత్వం మంటగలిసిన దారుణ ఘటన పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. కాసుల కోసం కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన లంగిడి లక్ష్మయ్య (48) మరియు ఆయన భార్య శేఖమ్మకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, శివ ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ వివాహితుడు. తండ్రికి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూనే, ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే శ్రీకాంత్ మద్యానికి బానిసగా మారి, పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ మద్యం కోసం డబ్బులు కావాలని తరచూ తండ్రి లక్ష్మయ్యతో గొడవ పడేవాడని కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించిన శ్రీకాంత్, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బలంగా మోదాడు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
దీంతో లక్ష్మయ్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. కుటుంబ (medak murder case) సభ్యులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మయ్యను అంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుడికి భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: