SLBC టన్నెల్‌లో జరగిన ఘోర ప్రమాదం, ఇటీవల జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లలో అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత 53 రోజులుగా రెస్క్యూ చర్యలతో కొనసాగుతోంది, ఇంకా 6 మృతదేహాలను బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. టన్నెల్‌లో చిక్కుకున్న మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది, వీరిని త్వరలో బయటకు తీయడం అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన నేపథ్యం:
SLBC టన్నెల్‌లో 8 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సిమెంట్ స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. టన్నెల్‌లోనే ఉండే మట్టిని తొలగించడానికి నిపుణులను నియమించి, 53 రోజులుగా నిరంతరం సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను రెస్క్యూ టీం బయటకు తీసింది, ఇంకా మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం నిరంతరం గాలింపు జరుగుతోంది.
రెస్క్యూ ఆపరేషన్:
టన్నెల్‌లో మట్టిని తొలగించడం, శకలాలను సురక్షితంగా బయటకు తరలించడం, ప్రత్యేక సాంకేతిక పరికరాలను ఉపయోగించడం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టినవి. రెస్క్యూ టీమ్లు, నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు ఈ కార్యాచరణలను వేగవంతం చేసి, మిగిలిన మృతదేహాలను త్వరలో బయటకు తీసే అవకాశాలను నిర్ధారిస్తున్నారు. 20 మీటర్ల దూరంలో మిగిలిన మృతదేహాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిని బట్టి నిపుణుల సూచనలతో డీ1 ప్రాంతంలో మట్టిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అతి త్వరలోనే మిగిలిన మృతదేహాలను కూడా బయటకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తొంది.
రెస్క్యూ టీమ్ చర్యలు:
ఈ ఘటన జరిగిన 16 రోజుల తర్వాత ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ అనే కార్మికుడు మృతదేహన్ని బయటకు తీయగా మార్చి 25న ఇంజనీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీసింది. ఈ ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం తర్వాత అధికారులు వారి కుటుంబసభ్యులకు అందజేశారు. SLBC ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతుల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.రూ.25 లక్షల నష్టపరిహారం అందించారు. రెస్క్యూ టీం టన్నెల్ లోని మట్టిని తొలగించడంలో మరియు మరిన్ని మృతదేహాలను బయటకు తీయడంలో ఎంతో నిబద్ధతతో పని చేస్తోంది. ఇంకా 20 మీటర్ల దూరంలో ఆ ముగ్గురు కార్మికుల మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు, దీనిని బట్టి డీ1 ప్రాంతంలో చేపట్టిన చర్యలు వేగవంతం అయ్యాయి.
Read also: Aghori : పెళ్లి చేసుకున్న అఘోరీ, శ్రీవర్షిణి