हिन्दी | Epaper

Siddipet MLA: ఇంటిని తాకట్టు పెట్టి.. విద్యార్థిని ఆదుకున్న హరీష్ రావు

Rajitha
Siddipet MLA: ఇంటిని తాకట్టు పెట్టి.. విద్యార్థిని ఆదుకున్న హరీష్ రావు

డాక్టర్ కావాలనే కలతో ముందుకు సాగుతున్న ఓ పేద టైలర్ కుమార్తె జీవితానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. లక్షల్లో ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఆ విద్యార్థిని చదువు ఆగిపోకుండా చేయడానికి, తన సొంత ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 లక్షల విద్యా రుణం ఇప్పించడం ద్వారా హరీశ్ రావు మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలో అవసరమైన చోట తానున్నానని నిరూపించారు.

Read also: Special Trains: సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

ఓ పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తితో కుటుంబాన్ని పోషిస్తూ కుమార్తె మమతను చదివించారు. మమత కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి, తాజాగా పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆప్తమాలజీ సీటు దక్కినా, కన్వీనర్ కోటాలో ఏటా రూ.7.50 లక్షల చొప్పున మూడు సంవత్సరాల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్తులు లేకపోవడంతో బ్యాంకులు రుణానికి నిరాకరించగా, ఈ నెల 18లోగా ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే ప్రమాదం నెలకొంది.

సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు

ఈ విషయం తెలుసుకున్న హరీశ్ రావు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్పందించారు. సిద్దిపేటలోని తన స్వంత నివాసాన్ని యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఖర్చుల కోసం అప్పు చేయవద్దని సూచిస్తూ, తన సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు అందజేశారు. గతంలోనూ ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇలాగే తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీశ్ రావు, ఈసారి ఓ పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870