हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Sarpanch Elections: పంచాయతీ ప్రచారంలో ప్రమాణాల హడావిడి

Pooja
Telugu News: Sarpanch Elections: పంచాయతీ ప్రచారంలో ప్రమాణాల హడావిడి

గ్రామ పంచాయతీ ఎన్నికల(Sarpanch Elections) ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థులు ఓటర్లతో ఉన్న పరిచయాలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి, “మీ ఇంట్లో ఉన్న ప్రతి ఓటు నాకే వేస్తామ‌ని ప్రమాణం చేయండి… చెప్పకపోతే మీ ఇంటి ముందే కూర్చుంటా” అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇతరులు డబ్బు, మద్యం ఇచ్చినా తీసుకోవొచ్చని, కానీ అసలు ఓటు మాత్రం తమకే వేయాలని కోరుతున్నారు. ‘ఒక్క ఛాన్స్ ఇస్తే ఊరి పరిస్థితులు మార్చేస్తా’ అంటూ హామీలు ఇస్తూ మంకుపట్టు పడుతున్నారు.

Read Also: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

Sarpanch Elections
Sarpanch Elections: Rush of standards in Panchayat campaign

కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత దూరం వెళ్లింది. తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల సర్పంచ్ (Sarpanch Elections) అభ్యర్థులు ఓటర్ల చేతిని పట్టుకుని ప్రమాణం చేయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరి చేత దేవుడి పటంపై ప్రమాణం చేయించి నిబద్ధత తీసుకుంటున్నారు.

గ్రామాల్లో రసవత్తర రాజకీయాలు

అభ్యర్థులు కుల సంఘాల నాయకులను కూడా ఒప్పించి, ఆ సంఘానికి చెందిన కుటుంబాల ఓట్లు మొత్తం తమకే పడేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ నాయకులు కూడా “మా సంఘం 80 ఇళ్ల ఓట్లు మొత్తం మీకే… అవసరమైతే మీ ఎదుటే ప్రమాణం చేస్తాం” అని భరోసా ఇస్తున్నారు. ఇతర అభ్యర్థులు ఓట్ల కోసం వచ్చినా మాటల్లో తోచి పంపిస్తామని చెబుతున్నారు.

వోటర్లు మారిపోకుండా ఉండేందుకు అభ్యర్థులు పలు రకాల ఒత్తిడి పద్ధతులు అవలంభిస్తున్నారు. చేతిలో చేతి వేసుకుని మాట తీసుకోవడం, మందిరాల్లో ప్రమాణం చేయించడం, నగదు ఇవ్వడం వంటి సంఘటనలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ప్రచారం రెండో, మూడో విడతలకు చేరుతుండగా మరికొందరు నేరుగా ఓటర్ల కాళ్లపై పడుతూ వేడుకుంటున్నారు.

ఈసారి యువ అభ్యర్థుల సంఖ్య ఎక్కువ. పెద్ద వారెవరినైనా చూసినా వారి కాళ్లపై పడుతూ ఓట్ల కోసం వేడుకోవడం కొత్తగా కనిపిస్తున్న దృశ్యం. ఓటర్లు “నీకు ఓటేస్తాం బిడ్డా” అని చెప్పినా, అభ్యర్థులు ఓటర్ల అరచేతిని తమ తలపై పెట్టుకుని స్పష్టమైన మాట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఓటర్లు కూడా ఎవరినీ నొప్పించకుండా, “ఒట్టు ఏందుకు… నీకే వేస్తాం, ఇంకొకరికి ఎలా వేస్తాం?” అంటూ పరిస్థితిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870