हिन्दी | Epaper

రేపటి నుంచి సంక్రాంతి సెలవులు..

sumalatha chinthakayala
రేపటి నుంచి సంక్రాంతి సెలవులు..

హైద‌రాబాద్ : తెలంగాణలో సంక్రాంతి పండుగ హ‌డావుడి మొద‌లైంది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో ఇవాళ ఘ‌నంగా సంక్రాంతి వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఎందుకంటే రేప‌ట్నుంచి స్కూళ్ల‌కు సంక్రాంతి సెల‌వులు కాబ‌ట్టి. స్కూల్ విద్యార్థులు సంప్ర‌దాయ దుస్తుల్లో ముస్తాబై పాఠ‌శాల‌ల‌కు వెళ్లారు. రాష్ట్రంలోని అన్ని ర‌కాల పాఠ‌శాల‌ల‌కు జ‌న‌వ‌రి 11 నుంచి 17 వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. 18వ తేదీన పాఠ‌శాల‌లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక జూనియ‌ర్ కాలేజీల‌కు జ‌న‌వ‌రి 11 నుంచి 16 వ‌ర‌కు సెలవులు ప్ర‌క‌టించారు. 17న పునఃప్రారంభం కానున్నాయి.

సెల‌వు దినాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాల‌ను హెచ్చ‌రించింది. ఇంట‌ర్ బోర్డు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కాలేజీల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇకపోతే.. స్కూళ్ల‌కు సంక్రాంతి సెల‌వుల నేపథ్యంలో హైదరాబాద్​, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మొదలైన బస్సులు ఈ నెల 13వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

రేపే ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

రేపే ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు

ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

నీట్ ఎండీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, అర్హతల పూర్తి వివరాలు!

నీట్ ఎండీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, అర్హతల పూర్తి వివరాలు!

మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

వారికీ ఉచిత స్కూటర్లు, స్కాలర్‌షిప్‌!

వారికీ ఉచిత స్కూటర్లు, స్కాలర్‌షిప్‌!

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

📢 For Advertisement Booking: 98481 12870