Sangareddy accident: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్ మద్దూర్ గ్రామానికి చెందిన బి రాములు అలియాస్ రమేష్ 45 సంవత్సరాలు బుధవారం తెల్లవారుజామున హత్నూర సమీపంలోని కొన్యాల చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్ అదుపుతప్పి బైక్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) తెలిపారు. ఇంట్లో భార్యతో గొడవపడి బయలుదేరిన ఇతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: