సికింద్రాబాద్ (secunderabad) : సనాతన ధర్మాన్ని Sanatana Dharma పరిరక్షించడమే ధ్యేయంగా ప్రతి హిందువు పాటుపడాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సనాతన ధర్మం హిందుత్వం భారతదేశంలో ఉన్నన్నినాళ్ళే సెక్యులరిజానికి అవకాశం ఉంటుందని హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం అనేది ఉందదని అన్నారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ రజతోత్సవాలు, శ్రీ తెలంగాణ (Telangana) వేద విద్వాన మహాసభల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

Sanatana Dharma
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (kishan Reddy) మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులకు నాలుగు రకాల వేద పరీక్షలు నిర్వహిస్తూ వేదాన్ని ప్రోత్సహించడం శుభ పరిణామమన్నారు. సనాతన ధర్మానికి Sanatana Dharma మరింత గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలో సనాతన ధర్మ రక్షణకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. సనాతన ధర్మం, హిందూమతం గురించి మాట్లాడితే దేశంలోనే విమర్శలు వస్తుండడం బాధాకరమన్నారు. ఇతర మతాలను కించపరచకుండా హిందూమతం గురించి మాట్లాడే స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాధ శర్మ, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మం పరిరక్షణపై ఎవరు వ్యాఖ్యానించారు?
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సనాతన ధర్మం పరిరక్షణపై వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు?
సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: