हिन्दी | Epaper

Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Saritha
Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో పదుల కొద్దీ మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది. ఈ తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో బయలుదేరరారు. (Road Accident) జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read Also: HYD Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

మరోవైపు హైదరాబాద్‌ నగరంలో మౌలాలి లోని స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన ఫంక్షన్ కి నిఖిల్ (22) కారులో వెళ్లి వస్తూ పోచారం సద్భావన టౌన్షిప్ లో ఉంటున్న స్నేహితులను దింపేందుకు వెళ్తుండగా మేడిపల్లి లోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 97 వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. దీంతో పిల్లర్ ను కారు బలంగా ఢీకొట్టింది. (Road Accident) ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే మరో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870