हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad :పెరుగుతున్న ఎండలు బయటికొచ్చేందుకు భయపడుతున్న జనాలు

Anusha
Hyderabad :పెరుగుతున్న ఎండలు బయటికొచ్చేందుకు భయపడుతున్న జనాలు

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తుంది. అదే విధంగా హయత్ నగర్, మంచిర్యాల జిల్లా కాసిపేట లో కూడా 40.7° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో 40.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, తిర్యాణి, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 40.4° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు తీవ్రత

రోజురోజుకి ఎండలు పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్లో 42 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇక మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక పక్క పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరోవైపు రాత్రి చల్లని గాలులు వీస్తున్నాయి.

వాతావరణ శాఖ

రాష్ట్రంలో భిన్న వాతావరణం ఈ వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయని అటువైపు నుంచి వస్తున్న గాలులతో పగటి పూట ఎండ, సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గుతుందని, ఈ వాతావరణం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్తున్నారు.18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం 18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

heat wave 6985 1739091433

మారుతున్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముందు ముందు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.వాతావరణ మార్పుల ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎండల తీవ్రతను తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హైడ్రేషన్‌ మెయింటైన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. మార్చి నెల చివరి వరకు మరింత వేడెక్కే అవకాశముండటంతో ప్రజలు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు హెచ్చరించారు.పొడిగా మారిన వాతావరణ పరిస్థితుల్లో నీటి లోపం తలెత్తకుండా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలని, అవసరం లేకపోతే మధ్యాహ్నం వేళలు బయటకు వెళ్లకూడదని, తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870