हिन्दी | Epaper

Revanth : రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు – కేటీఆర్

Sudheer
Revanth : రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు – కేటీఆర్

BRS నాయకుడు, ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణమైన నాయకుడు కేసీఆర్‌నే నిజమైన జాతిపితగా భావించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం అభ్యంతరకరమైన మాటలతో రాష్ట్ర రాజకీయాలను దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.

‘తెలంగాణ బూతుపిత’ అవుతారని ఎద్దేవా

కేటీఆర్ రేవంత్ రెడ్డిని ‘తెలంగాణ బూతుపిత’గా అభివర్ణిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చర్చలు, వాగ్వాదాలు ఒక దశలో ఉండాలని, కానీ బూతు రాజకీయాలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదని, కానీ ఉద్యమ కారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర మాత్రం ఆయనదేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం
అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

ప్రజాపాలన విఫలమైందని విమర్శలు

కేటీఆర్ రేవంత్ పాలనను ప్రజావ్యతిరేకంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఆశించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా వంచనకు గురయ్యాయని, ప్రభుత్వం మాయ మాటలు చెప్పడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయిందని మండిపడ్డారు.

‘తెలంగాణ రైజింగ్’ ముసుగులో అప్పులు, అబద్ధాలు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వ హావభావాలు అసలు నిజాలను కప్పిపుచ్చడానికి మాత్రమేనని కేటీఆర్ ఆరోపించారు. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టారని చెప్పారు. అప్పులు, అబద్ధాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన దుయ్యబట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870