తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరంలో పాల్గొన్న ఆయన, ట్రంప్ విధానాలు మరియు కేసీఆర్ పాలన మధ్య పోలికలు చూపించారు.
“ట్రంప్‌లాంటి నాయకులు ఎక్కువ కాలం నిలవరు. రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేసే వ్యక్తులు ఎప్పటికీ విజయవంతం కాలేరు. ట్రంప్ ఒకరోజు ప్రధాని మోదీని మిత్రుడిగా పొగిడితే, మరుసటి రోజే భారత్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరిస్తారు,” అని రేవంత్ విమర్శించారు. అదే తరహాలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రణాళికలు
రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్(Roadmap) తమ ప్రభుత్వం దగ్గర ఉందని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న నాన్-ఈవీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు మార్చనున్నట్లు వెల్లడించారు.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles) అమ్మకాలలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని గుర్తుచేశారు. అలాగే, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రతిపాదనలు అమలులో ఉన్నాయని తెలిపారు.
భద్రత & డ్రగ్స్ నిర్మూలనపై చర్యలు
డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘ఈగల్ స్క్వాడ్’ సమర్థవంతంగా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన పోలీస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని గర్వంగా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ వ్యాఖ్యలు చేశారు?
ఢిల్లీలో జరిగిన బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరంలో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను ఎవరితో పోల్చారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: