గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు(RajaSingh) మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈసారి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా లేఖ రూపంలో హెచ్చరికలు అందడం సంచలనంగా మారింది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ హఫీజ్ పేరుతో ఈ లేఖ వచ్చినట్లు సమాచారం.
Read Also: Hyderabad: ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

‘పోలీసుల మద్దతు ఉంది’ అంటూ సవాల్
లేఖలోని విషయాలు అత్యంత తీవ్రంగా, సవాల్ విసిరేలా ఉన్నాయని తెలుస్తోంది. “నాకు పోలీసుల మద్దతు ఉంది, నువ్వు నన్ను ఏమీ చేయలేవు” అంటూ రాసినట్టు సమాచారం. అంతేకాదు, బాంబు దాడి చేస్తామంటూ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని తీవ్ర బెదిరింపులు చేసినట్టు వెల్లడైంది. లేఖ అందిన వెంటనే రాజాసింగ్ అనుచరులు, భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కుట్ర కోణంలో విచారణ
ఇంతకుముందు కూడా విదేశాలు సహా పలు ప్రాంతాల నుంచి రాజాసింగ్‌కు(RajaSingh) బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు లేఖ ద్వారా హెచ్చరికలు రావడం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ఆసిఫ్‌నగర్ పరిసరాల్లో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎమ్మెల్యే భద్రతను మరింత కఠినతరం చేసే అవకాశముందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: