हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

Latest News: TG Weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

Anusha
Latest News: TG Weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణ (Telangana) లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ (Rain alert) జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించబడింది.

Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

హైదరాబాద్, మేడ్చల్, రాజన్న, కరీంనగర్, జగ్గయ్యపేట, మహబూబాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం (సెప్టెంబరు 30 ) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

ఇది అక్టోబర్ 1 నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ గుజరాత్, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. నేడు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు.

 TG Weather
TG Weather

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, జగిత్యా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటుగా.. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయన్నారు.దక్షిణ/మధ్య తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌తోపాటుగా మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులలో నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870