హైదరాబాద్ (Hyderabad) నగరంలో శనివారం సాయంత్రం వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఊహించని విధంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం (Rain) కురిసింది. బషీర్‌బాగ్, లక్డికాపూల్, లిబర్టీ, లంగర్‌హౌస్, గోల్కొండ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సనత్‌నగర్, మియాపూర్, ఆల్వాల్, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది.
నీటమునిగిన రహదారులు – ట్రాఫిక్‌కు అడ్డంకులు
వర్షం (Rain) తీవ్రతతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. ముఖ్యంగా కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన నీటితో పలుచోట్ల వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం – వర్షాలు ముందస్తు హెచ్చరిక
భారత వాతావరణ శాఖ ప్రకారం, దేశ వ్యవసాయానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ కంటే తొందరగా దేశంలోకి ప్రవేశించాయి. శనివారం నాడు కేరళ తీరాన్ని ఈ రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే సూచనగా భావించబడుతోంది.
Read Also : Novak Djokovic : నొవాక్ జకోవిచ్‌కి 100వ టైటిల్ – చరిత్రలో అరుదైన ఘనత!