హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఈ వర్షాలకు తోడయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

వర్ష ప్రభావం
ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి తగ్గగానే నమోదైంది. రాష్ట్రంలోని 281 మండలాల్లో సాధారణ వర్షపాతం (Normal rainfall) నమోదు కాగా, ఆందోళనకరంగా 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Alert) కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, వర్గల్‌లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో 3 సెం.మీ, నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లెలో 2 సెం.మీ వర్షం పడింది.
ఎల్లో అలర్ట్ జారీ – ప్రభావిత జిల్లాలు
వాతావరణ శాఖ బహుళ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ (Yellow Alert issued) చేసింది. వాటిలో ముఖ్యమైనవి. నేడు ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఉరుములు మెరుపులు, గాలి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గాలుల ప్రభావం & భద్రతా సూచనలు
కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. పశ్చిమ, వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయన్నారు.
బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ప్రజలు ఒంటరిగా బయట ఉండకుండా, మెరుపులు పడే సమయంలో మొబైల్ వాడకూడదని, మరియు తక్కువ ఎత్తులో ఉండాలని సూచించారు .
Read hindi news: hindi.vaartha.com