Rain Alert: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు పెద్ద నష్టాన్ని చవిచూశారు. వర్షపు నీరు మార్కెట్ పరిధిలోకి చేరి, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది.
వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టానికి ఫలితంగా పండించిన పంట ఇలాగే నాశనం కావడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read also: TG: నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన
Rain Alert: డ్రైనేజీలో చేరిన ధాన్యాన్ని ఎత్తిపోస్తూ ఓ మహిళా రైతు గుండెలు బాదుకుంటూ విలపించడం అక్కడి ప్రజలను కదిలించింది. నెలల తరబడి శ్రమించి పండించిన పంట నీటిలో కలిసిపోవడం తనకు తట్టుకోవడం కష్టమైందని ఆమె వాపోయింది.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటూ, మార్కెట్‌ను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌ను కాళ్లకు పడుతూ న్యాయం చేయాలని అభ్యర్థించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: