ట్రస్ట్ బ్యాంక్ ప్రతిపాదన విరమించుకోవాలి : ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah)
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాలేజీ కోర్సుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు చెల్లించాలని, ట్రస్ట్ బ్యాంక్ ప్రతిపాదన విరమించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రికి ఆర్. కృష్ణయ్య లేఖ రాశాడు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ (Fee Reimbursement) స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా టెస్ట్ బ్యాంక్ నిధి (Test Bank Fund) అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యజమాన్యాల ద్వారా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. దీనిపై తెగించి పోరాడుతామని, స్కీమును రక్షించుకుం టామని ఆయన సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆర్. కృష్ణయ్య ఏ పార్టీ?
ఆర్. కృష్ణయ్య ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు.
ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని ఏమి కోరారు?
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.
ఆయన టెస్ట్ బ్యాంక్ ప్రతిపాదనపై ఏమన్నారు?
టెస్ట్ బ్యాంక్ ఫండ్ అనే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, స్కీమును రక్షించేందుకు పోరాడుతామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandi Sanjay: మరో రికార్డుకు సిద్ధమైన బండి సంజయ్ కుమార్