ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ఎకో టూరిజం కేంద్రంలో జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసలు కురిపించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇది ఆదర్శంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం రాష్ట్రంలోని అన్ని ఎకో టూరిజం సెంటర్లు అనుసరించాలని సూచించారు.

అటవీ సంరక్షణతో పాటు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ వన జీవధార అభియాన్ (టీవీజేఏ), వన సంరక్షణ సమితులు (విఎస్ఎస్) పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ పథకంలో హస్తకళలు, నర్సరీ నిర్వహణ, ఎకో టూరిజం, తేనెటీగల పెంపకం, హర్బల్ తోటల అభివృద్ధి వంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని వివరించారు. క్యాంపా, టీజీ ఎఫ్టీసీ, సీఎస్ఆర్ నిధులు, కేంద్ర పథకాల(Central schemes) సహకారంతో ఈ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని, వచ్చే మూడు సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో 500 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

మంత్రి సురేఖకు కుటుంబాల హృదయపూర్వక కృతజ్ఞతలు
అదే సమయంలో, రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు డెత్ గ్రాట్యూటీని స్వయంగా అందజేసిన మంత్రి సురేఖకి కుటుంబీకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “నువ్వు సల్లంగుండాలె” అంటూ భావోద్వేగంతో ఆమెకు కృతజ్ఞతలు (Thank you) తెలిపారు.
శుక్రవారం మంత్రి తన పేషీలో 20 బాధిత కుటుంబాలకు రూ. కోటి ఐదు లక్షలు సహాయం అందజేశారు. ఇందులో విధి నిర్వహణలో మరణించిన ఆరుగురు ఎండోమెంట్ ఉద్యోగుల కుటుంబాలు, రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపనయనం బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ లోన్ సహాయం పొందారు. గ్రాట్యూటీ ప్రక్రియను వేగవంతం చేసినందుకు మంత్రి సురేఖకి కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పులిగుండాల ఎకో టూరిజం కేంద్రంలో ఏ ప్రయత్నం ప్రశంసలు అందుకుంది?
ప్లాస్టిక్ తగ్గించి జ్యూట్ బ్యాగుల వాడకం.
ఈ ప్రయత్నాన్ని ఎవరు అభినందించారు?
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: