హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో అద్భుతమైన పాలన అందించారని తెలిపారు. కానీ ప్రజలను ఘోరంగా మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణలోని సంపదను పక్క రాష్ట్రాలు దోచుకుంటున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నేతల దోపిడీని, అవినీతిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని అన్నారు. తెలంగాణ రక్షణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు “వీరోచిత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. నైనీ బొగ్గు గని దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుందని తెలిపారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని అన్నారు. ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసులతో వేధిస్తున్నారని తెలిపారు. కేటీఆర్కు సంబంధం లేని కేసులో విచారణకు పిలిచారని అన్నారు.
Read Also: Telangana: మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

తెలంగాణలో సంపద దోచుకునే పరిస్థితులు..ప్రవీణ్ కుమార్
ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ, తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెబుతుందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారని గుర్తుచేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రతన్ టాటా చెబితే.. 9 వేల ఫోన్లు ట్యాప్ చేశామని మన్మోహన్ సింగే చెప్పారని గుర్తుచేశారు. ప్రతిరోజు కొన్ని మెయిల్స్ ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ గోప్యంగా జరుగుతుందని తెలిపారు. హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్లకు కూడా ఎస్ఐఐబీ ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. ఫలానా విధంగా సమాచారం సేకరించినట్లు ప్రధాని, ముఖ్యమంత్రికి కూడా చెప్పరని తెలిపారు. అందుకే ఢిల్లీలో కూడా ఫోన్ ట్యాపింగ్పై చర్చ జరగడం లేదన్నారు.
దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ట్యాపింగ్ అవసరం
తన రాజకీయ కక్షలకు ట్యాపింగ్ను సీఎం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారు. ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని నాడు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోని చూపించారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ దీని మీద ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదని దేశ భద్రత రీత్యా ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కేటీఆర్ను ఏమీ చేయలేరన్నారు.. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్కు సజ్జనార్ చీఫ్గా ఉన్నాడని తెలిపారు.
సజ్జనార్ సిట్ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదన్నారు. రూ.50లక్షలతో దొరికినప్పుడు సీఐడీ డీసీపీగా కూడా సజ్జనార్ ఉన్నారని.. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడన్నారు. ఆనాడు సజ్జనార్, ఇంకా కొంతమంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఏ అర్హతత ట్యాపింగ్ విచారణ చేస్తున్నారో చెప్పాలని సజ్జనార్ను డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్రరావుపై పెట్టిన కేసు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. అయినప్పటికీ ఆయన్ను సిట్ -విచారణకు పిలిచిందని మండివడ్డారు. సీనియర్ మంత్రులను 9 గంటల పాటు విచారించాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: