हिन्दी | Epaper

Phone Tapping Case : ముగిసిన ప్రణీత్ రావు విచారణ

Sudheer
Phone Tapping Case : ముగిసిన ప్రణీత్ రావు విచారణ

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Pranith Rao) విచారణ ముగిసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు ఈరోజు దాదాపు ఐదు గంటల పాటు ఆయనను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం, వాటి ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. గతంలోనూ జూన్ 13, 18 తేదీల్లో ప్రణీత్ రావును అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

ఎవరి ఆదేశాలపై ట్యాపింగ్?

విచారణలో ముఖ్యంగా “ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారో?” అనే అంశంపై సిట్ అధికారులు ప్రణీత్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మర్మం తెలుసుకునేందుకు ప్రయత్నించిన సిట్, ప్రణీత్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో నిర్ధారించేందుకు అనేక కోణాల్లో విచారణ సాగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న దానిపై దృష్టి

ఈ కేసులో అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న అంశంపైనా సిట్ దృష్టి పెట్టింది. రాజకీయ నేతలు, ఉద్యోగులు, జర్నలిస్టుల ఫోన్లను లక్ష్యంగా చేసారా? అనే కోణంలో విచారణ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇది ఒకవ్యక్తిగత చర్యా? లేక రాజకీయ నాయ‌కుల ప్రమేయం ఉన్న వ్యవహారమా? అనే దానిపై స్పష్టత తీసుకురావడానికి అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Sonia Gandhi: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

📢 For Advertisement Booking: 98481 12870