తెలంగాణను కలచివేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు (A1)గా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar) విచారణకు హాజరై వేడి చల్లారు. హైదరాబాద్‌లోని S.I.T. కార్యాలయంలో జరిగిన ఈ విచారణ దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగింది. జూన్ 9 ఉదయం ప్రారంభమైన ఈ విచారణలో, డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఉన్న ప్రత్యేక బృందం ఆయనను పలువురు ప్రస్తుత, భూతపూర్వ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కఠినంగా ప్రశ్నించింది. టెక్నికల్ డేటా, ఎలక్ట్రానిక్ ఆధారాలు, డాక్యుమెంట్లతో కూడిన సమాచారం ప్రభాకర్ ఎదుట ఉంచి వివరణ కోరినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసు
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదై వెలుగులోకి వచ్చింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో, అప్పటి ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులపై అక్రమంగా ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు ఈ కేసు కేంద్రంగా మారాయి. SIB అధికారుల సహకారంతో కీలక ఫోన్ సంభాషణలు రికార్డు చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన విదేశంలో ఉండగా, పాస్‌పోర్ట్ రద్దు చేసి, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వన్-టైమ్ ట్రావెల్ పర్మిట్ ఇచ్చి భారత్‌కు రప్పించారు.
విచారణ లోమరిన్ని మలుపులు
ప్రభాకర్ రావు జూన్ 8న రాత్రి హైదరాబాద్ చేరుకుని, వెంటనే జూన్ 9న విచారణకు హాజరయ్యారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక IG స్థాయి అధికారి పై జరుగుతున్న అరుదైన విచారణగా అభివర్ణించబడుతోంది. ఇప్పటివరకు రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు లాంటి వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ కీలక అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, ఇంకా అనేక అంశాలపై విశ్లేషణ మిగిలి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయనను జూన్ 11న మళ్లీ విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. అలాగే విచారణ ముగిసే వరకు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించే అవకాశముందని భావిస్తున్నారు.
Read Also : Welfare : జులై 1 నుంచి గడపగడపకు వెళ్లాలి – లోకేశ్