हिन्दी | Epaper

Ponnam Prabhakar: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తాం

Tejaswini Y
Ponnam Prabhakar: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తాం

తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. శాసన మండలిలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బిఆర్ఎసన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడగా.. అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Read Also: Nara Lokesh on Akshaya Patra: అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గత 10 సంవత్స రాలుగా పరిపాలించిన ప్రభుత్వం అమరవీరుల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల వారి చిత్తశుద్ధి ఉద్యమకారులందరికీ తెలుసునని, తాము వారి ఆకాంక్షను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులుగా తాను, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా విధివిధానాలు ఖరారు చేసేలా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

Ponnam Prabhakar: We will do due justice to Telangana activists
Ponnam Prabhakar: We will do due justice to Telangana activists

తెలంగాణ ఉద్యమ కారులకు సముచిత న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని అడిగే ముందు 10 సంవత్సరాలుగా మీరేం చేశారో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అమరవీరులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఏం చేశారని.. స్వయంగా వారి కుటుంబ సభ్యురాలు విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు గుర్తించలేదన్నారు. ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం అని చట్టం ఎందుకు చేయలేదని, తాము ఏమైనా అడ్డుకున్నామా? అని ప్రశ్నించారు. అందరినీ సంప్రదించిన తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని గ్రామీణ ప్రాంత మహిళను ప్రతి బింబించేలా ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్ర హాన్ని ఏర్పాటు చేసి సెక్రటేరియట్ గుండెల్లో పెట్టుకున్నామన్నారు. పేద ప్రజలు కులాలకు అతీ తంగా ఆడుకుని జరుపుకునే బతు కమ్మ టిఆర్ఎస్ పేటెంట్లాగ మాట్లాడుతున్నారని. ఇది మీ పేటెంట్ కాదు.. పేద ప్రజలకు సంబంధించిన ఆంశమన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చట్టం చేశామని, అది కేంద్రం పరిధిలో ఉందని, బీసీ లకు 42 శాతం అమలు చేయడానికి ఇప్పటికీ సీరి యస్ గా ఉన్నామని మంత్రి పొన్నం శాసన మండలిలో స్పష్టం చేశారు. మీరు ప్రభుత్వం నిర్వ హించిన సర్వేలో పాల్గొనకుండా, రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము చట్టం చేశామని, గవర్నర్ ద్వారా బిల్లు రాష్ట్రపతి దగ్గ రకు పోయిందని మంత్రి గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, బలహీన వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. బలహీన వర్గాల రిజిస్ట్రేషన్ల కోసం ఢిల్లీలో కోట్లాడుదాము రండి అంటే మీరు రాలేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870