హైదరాబాద్ (నాంపల్లి) : రానున్న కొద్దిరోజులు ఇప్పుడున్న భూభారతి యాప్ ను పునరుద్ధరించి కొత్త యాప్ ను తీసుకొచ్చే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టామని, (Ponguleti Srinivas) మార్చి నెల నాటికి ఆ కొత్త యాప్ ప్రజోపయోగ సమగ్ర సమాచారంతో రాబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ యాప్ ద్వారా రెవెన్యూ రికార్డులతోపాటు భూసర్వేకి సంబంధించిన వ్యవస్థ మ్యాపులతోసహా వ్యవసాయేతర భూములు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయానికి యోగ్యంకాని భూములు కానీ, నివాసయోగ్యమైన భూములను ఒకే ప్లాట్ఫారంలోకి సింగిల్పిజీలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఎక్కడా చిన్న తప్పులు, ఆవకతవకలు జరగకుండా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో (TG) ఉండే ప్రజలకు వారి ఆస్తుల, ప్రభుత్వ ఆస్తుల భద్రతతోపాటు వారు ప్రపంచంలో ఎక్కడున్నా వారికి సంబంధించిన ఆస్తులు సరిగ్గా ఉన్నవీ లేనివీ చూసుకునేట్లు ఈ కొత్త యాప్ ఉంటుందన్నారు.
Read also: TG: హిల్ట్ పాలసీతో రాష్ట్రానికి రూ.10,776 కోట్ల ఆదాయం

భూముల సమగ్ర సమాచారం ఒకే ప్లాట్‌ఫారంలో
ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెస్సా నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళావేదికలో రాష్ట్ర రెవెన్యూ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas) సంఘ ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, టీఎన్జీవో నాయకులు శ్రీనివాసరావు, నర్సింహారెడ్డి, రమణారెడ్డి, ఉపేందర్రెడ్డి, రాజకుమారి, చంద్రకళ తదితర ట్రెస్సా బాధ్యులతో కలిసి రెవెన్యూ శాఖ నూతన సంవత్సరం 2026 డైరీ ఆవిష్కరించి ప్రసంగించారు. గత 10సంవత్సరాల్లో ధరణి, దాంతో వచ్చిన ఇబ్బందులు, కష్టాలు, ఉద్యోగులతోపాటు భూములున్న ఆసాములకు వచ్చిన కష్టాలు, బాధల నుండి విముక్తి కలిగించే విధంగా ఆనాటి పెద్దలు భ్రష్టుపట్టించిన రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కోని ఎన్నో సంస్కరణలు ప్రజాప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు.
పారదర్శక రెవెన్యూ వ్యవస్థకు సంస్కరణలు
రెవెన్యూ వ్యవస్థను పటిష్టంచేయడమే కాకుండా చట్టంలోని లొసుగుల్ని సంస్కరణల రూపంలో సరిదిద్ది ప్రజలకు ఉపయోగకరరీతిలో మార్పులు చేశామన్నారు. అంతేకాక రాష్ట్రంలో సర్వేయర్ల సంఖ్యను ప్రభుత్వపక్షాన పెంచుతూ అదేవిధంగా లైసెన్స్ డ్ సర్వేయర్లను కూడా గతంలో 6వేల మందిని ఎంపికచేశామని, మరో 2500మందిని నాలుగైదు రోజుల్లో ఆర్డర్లు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా తమశాఖ ఉద్యోగుల కోర్కెలు, సమస్యలను సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామున్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉద్యోగులకు, ఉద్యోగుల ఇబ్బందులు ప్రభుత్వానికీ తెలియనిది కాదని, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం అటుఇటూ అయినా అన్నింటిని పరిష్కరిస్తామని ఉద్యోగులకు మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: