हिन्दी | Epaper

సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు వార్నింగ్‌

sumalatha chinthakayala
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు వార్నింగ్‌

హైదరాబాద్‌: సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఘాటు హెచ్చరికలు ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా, పక్కదారి పట్టించేలా పోస్టులు చేయవద్దని కోరారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై నిఘా ఉంచామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే వీడియో రూపంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు.

అయినా కొంతమంది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖను కించపరిచేలా ప్రచారాలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఓ మహిళ మరణం మరో పిల్లాడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ఈ ఘటనపై ఎవరి దగ్గరైనా అదనపు సమాచారం కానీ వీడియోలు కానీ ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగించండి సొంత వ్యాఖ్యానాలను సోషల్ మీడియాలో చేయవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870