తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడైన SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao)కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ అయింది. దీంతో ఆయన వన్ టైమ్ ఎంట్రీ ద్వారా అమెరికా నుంచి బయలుదేరి, రేపు అర్ధరాత్రి భారతదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఆయన్ని విచారించేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.
సిట్ ముందు హాజరయ్యే అవకాశం
ప్రభాకర్ రావు సోమవారం నాడు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు కోసం సిట్ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండటంతో ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేకపోయారు.
ఆయన్ను విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు
ఇకపోతే, సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని అరెస్ట్ చేయకుండా విచారించాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన రాకతో కేసు మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది.
Read Also : Annadata Sukhibhava : ఈ నెలలోనే ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బు జమ!