తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పీజీ తెలుగు విభాగం ద్వితీయ సంవత్సరం చదువుతున్న అశ్విని (24) అనే విద్యార్థిని వసతి గృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్య (Sucide) కు పాల్పడింది.
బీర్కూరు మండలం కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థిని
అశ్విని బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని. ఆమె చదువులోను, ప్రవర్తనలోను మామూలుగానే ఉండేదని సహచరులు చెప్పారు. నిన్న సాయంత్రం వరకు ఫోన్‌లో కుటుంబసభ్యులతో మాట్లాడిన ఆమె, హాస్టల్లోని తన గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికే ఆత్మహత్య (Sucide) కు పాల్పడింది.
అత్యవసర సేవలు అందకపోవడం విద్యార్థుల ఆగ్రహానికి దారి
ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే హాస్టల్ సిబ్బంది స్పందించలేకపోవడం (Hostel staff’s inability to respond) విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను ఆసుపత్రికి తరలించేందుకు ఉపయోగించే వాహనం అందుబాటులో లేకపోవడం, డ్రైవర్ లేకపోవడం వల్ల అశ్వినిని తక్షణమే ఆసుపత్రికి తరలించలేకపోయారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు యూనివర్శిటీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహన డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు
Read hindi news: hindi.vaartha.com
Read also: